Back to FeedQuickToday Shorts

General
Sep 9, 2026Short Read
10టీవీ రిపోర్టర్ కుటుంబంలో తీవ్ర విషాదం:
పరామర్శించిన ప్రముఖులు
జనగామ, సెప్టెంబర్ 08 (క్విక్ టుడే న్యూస్):
జనగామ 10టీవీ ప్రతినిధి మాచర్ల ఆశిష్ తండ్రి రెండు రోజుల క్రితం అనారోగ్యం కారణంగా తుదిశ్వాస విడిచారు.
ఈ విషాద వార్త తెలుసుకున్న పట్టణ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు ఆశిష్ నివాసానికి చేరుకుని, ఆయన తండ్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
?
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ బాలమణి శ్రీనివాస్, కౌన్సిలర్లు రామగళ్ల విజయ్, కరుణాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడ శ్రీనివాస్, భారత్వజ్ తదితరులు శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించారు.
వారి ఆత్మీయ వియోగానికి తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, ఈ కష్టసమయంలో బాధిత కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసానిచ్చారు.



