Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Sep 7, 2026Short Read
జగన్ - విజయసాయిరెడ్డి క్రైమ్ పార్ట్నర్స్: మంత్రి సత్యకుమార్ సంచలన ఆరోపణలు!
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త పార్టీపై అప్డేట్ ఇవ్వనున్న నేపథ్యంలో ఏపీ మంత్రి సత్యకుమార్ తిరుపతిలో స్పందించారు.
ప్రజాస్వామ్యంలో ఎవరైనా కొత్త పార్టీ పెట్టుకోవచ్చని, అయితే జగన్-విజయసాయిరెడ్డిద్దరూ 'క్రైమ్ పార్ట్నర్స్' అని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
గతంలో YSR హయాంలో జరిగిన అవినీతి కేసుల్లో VSR A2గా ఉన్నారని గుర్తుచేశారు.గత YCP ప్రభుత్వ పాలనలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, కల్తీ మద్యం కారణంగా దాదాపు 30 వేల మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు.
ఈ తీవ్రమైన విషయాలపై జగన్, విజయసాయిరెడ్డి ఇద్దరూ ప్రజలకు సమాధానం చెప్పాలని మంత్రి సత్యకుమార్ డిమాండ్ చేశారు.



