Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Sep 24, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
ఏపీలో మళ్లీ పెరిగిన బియ్యం, ఉల్లి ధరలు.. సామాన్యులపై భారం!
ఆంధ్రప్రదేశ్లో బియ్యం ధరలు సెప్టెంబరులోనూ అమాంతం పెరిగాయి.
25 కేజీల HMT సన్న బియ్యం ధర జులైలో ₹1,670 ఉండగా, ఆగస్టులో ₹1,850కి, సెప్టెంబరు నాటికి ₹1,900కు చేరింది.
అలాగే BPT రకం ధర జులైలో ₹1,436 నుండి సెప్టెంబరులో ₹1,750కి పెరిగింది.మరోవైపు రిటైల్ మార్కెట్లో కేజీ ఉల్లి ధర ₹70 నుండి ₹80 వరకు పలుకుతోంది.
రాయితీపై ఉల్లి పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇంకా ప్రారంభం కాకపోవడంతో, వరుసగా పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Tags:#Andhra Pradesh#National#Shorts





