Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Sep 7, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
దసరాకు కొత్త పార్టీ.. సీఎం రేసులో నేను లేను: విజయసాయిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రాన్ని కేవలం రెండు రాజకీయ పార్టీలే ఎందుకు పాలించాలి?
రెడ్లు, కమ్మలు మాత్రమే సీఎంలు కావాలా?
అని ఆయన ప్రశ్నించారు.
రాబోయే దసరా పండుగ రోజున తన కొత్త పార్టీని ప్రకటించనున్నట్లు విజయవాడలో వెల్లడించారు.కొత్త పార్టీ పెడుతున్నప్పటికీ తాను గానీ, తన కుటుంబ సభ్యులు గానీ సీఎం అభ్యర్థులుగా ఉండబోమని ఆయన స్పష్టం చేశారు.
తాను కేవలం పార్టీకి మెంటార్‌గా మాత్రమే వ్యవహరిస్తానని తెలిపారు.
ముఖ్యమంత్రి పదవికి కులం ప్రాతిపదిక కాకూడదని, సామర్థ్యం, దేశభక్తి, మేధస్సు ఉన్నవారే ఆ స్థానానికి అర్హులని ఆయన అభిప్రాయపడ్డారు.



