Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Aug 9, 2026Short Read
మెడికో ప్రియాంక మృతిపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి
రాజమండ్రిలో మద్యం మత్తులో యువకులు కారుతో ఢీకొట్టిన ఘటనలో మెడికల్ విద్యార్థిని ప్రియాంక మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
భవిష్యత్తులో మంచి డాక్టర్ కావాల్సిన యువతి ఇలా ప్రాణాలు కోల్పోవడం తనను కలచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేసి జైలుకు పంపామని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని సీఎం తెలిపారు.
నిర్లక్ష్యంగా వ్యవహరించి నిండు ప్రాణాలు తీసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, చట్టపరంగా వారికి కఠిన శిక్షలు పడేలా చూస్తామని హామీ ఇచ్చారు.
బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు.





