Back to FeedQuickToday Shorts

Telangana
Aug 29, 2026Short Read
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రికార్డులు
ఈ ఏడాది మొదటి భాగంలో హైదరాబాద్లో రూ.52,913 కోట్ల విలువైన ఇళ్లు అమ్ముడయ్యాయని క్రెడాయ్ (CREDAI) నివేదిక వెల్లడించింది.
ఇళ్ల అమ్మకాల విలువ పరంగా బెంగళూరు, ముంబై తర్వాత హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది.2025 H1 తో పోలిస్తే సగటు ఇంటి ధర రూ.1.85 కోట్ల నుంచి రూ.2.03 కోట్లకు పెరిగినట్లు నివేదిక పేర్కొంది.
ప్రస్తుతం 1,42,722 ఇళ్లు (కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి) అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయని, ఇవన్నీ అమ్ముడవడానికి మరో 29 నెలల సమయం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు.





