Back to FeedQuickToday Shorts

National
Sep 20, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
3 రోజులు బ్యాంకులు బంద్: ఎస్బీఐ కీలక సూచనలు, ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే!
యూనిఫైడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) పిలుపు మేరకు రాబోయే మూడు రోజుల పాటు బ్యాంకులు బంద్ కానున్నాయి.
ఈ నేపథ్యంలో ఎస్బీఐ (SBI) తన కస్టమర్లకు ఒక అడ్వైజరీ జారీ చేసింది.
ఈ నెల 28, 29, 30 తేదీల్లో బ్యాంకులు పూర్తిగా బంద్ కానున్నట్లు ప్రకటించారు.బ్యాంకులకు వరుస సెలవులు రానున్నందున, మీ ముఖ్యమైన బ్యాంకింగ్ లావాదేవీలను ఈ రోజుల్లోనే ముందే పూర్తి చేసుకోవాలని ఎస్బీఐ సూచించింది.
నగదు అవసరాల కోసం ఏటీఎంలు (ATMs), ఏడీడబ్ల్యూఎంలను (ADWMs) వినియోగించుకోవాలని కోరింది.
అలాగే కస్టమర్ సర్వీస్ పాయింట్లు, ఇంటర్నెట్/మొబైల్ బ్యాంకింగ్, యోనో (YONO), యూపీఐ (UPI) మరియు ఇతర డిజిటల్ ఛానళ్లను ఉపయోగించుకోవాలని కస్టమర్లకు స్పష్టం చేసింది.


