Back to FeedQuickToday Shorts

National
Oct 8, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
జంతర్‌మంతర్ వద్ద ఉద్రిక్తత.. రాహుల్, ప్రియాంక సహా ఎంపీల అరెస్టు
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై విపక్షాల ఆందోళన ఢిల్లీలో వరుసగా రెండో రోజూ కొనసాగింది.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి ఎంపీలు జంతర్‌మంతర్ వద్ద నిరసన చేపట్టారు.
ఈసీ కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో భారీగా పోలీసులను మోహరించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
తనపై నమోదైన ఎఫ్ఐఆర్లను ‘మెడల్స్’గా భావిస్తానని, ప్రజాస్వామ్యం కోసం పోరాటం కొనసాగిస్తానని అన్నారు.
దాదాపు 300 మంది ఎంపీలు ఈసీని కలిసేందుకు వెళ్తే అనుమతి నిరాకరించారని ఆరోపించారు.
ఇదే సమయంలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
పోలీసుల తీరును ప్రశ్నించారు.
అనంతరం రాహుల్, ప్రియాంక సహా పలువురు విపక్ష ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.



