Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Sep 9, 2026Short Read
వాటర్ బాటిల్‌పై రూ.7 దోపిడీ.. షాపు యజమానికి రూ.7 లక్షల భారీ జరిమానా!
కాకినాడ జిల్లా అన్నవరం ఆలయ ప్రాంగణంలోని ఒక షాపులో వాటర్ బాటిల్‌ను MRP కంటే ఎక్కువకు విక్రయించినందుకు యజమానికి భారీ జరిమానా పడింది.
పిఠాపురానికి చెందిన వెంకటేశ్వరరావు రూ.18 విలువైన బాటిల్ కొనగా, షాపు నిర్వాహకుడు రూ.25 వసూలు చేశాడు.
దీనిపై బాధితుడు కన్జ్యూమర్ ఫోరంలో ఫిర్యాదు చేశారు.
విచారణ చేపట్టిన ఫోరం..
అదనంగా తీసుకున్న రూ.7 తిరిగి ఇవ్వడంతో పాటు, కోర్టు ఖర్చుల కింద రూ.10 వేలు చెల్లించాలని తీర్పునిచ్చింది.
అలాగే, వినియోగదారుల సంక్షేమ నిధికి ఏకంగా రూ.7 లక్షలు జరిమానాగా కట్టాలని యజమానిని ఫోరం ఆదేశించింది.



