Back to FeedQuickToday Shorts
General
Sep 29, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
మహిళల ట్రాప్ షూటింగ్లో భారత్కు తొలి వ్యక్తిగత స్వర్ణం.. నీరూ దండా చారిత్రక విజయం..
2026 ఆసియా క్రీడల్లో భారత స్టార్ షూటర్ నీరూ దండా చరిత్ర సృష్టించారు.
మహిళల ట్రాప్ షూటింగ్ వ్యక్తిగత విభాగంలో అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని సాధించారు.
ఈ సీజన్లో వ్యక్తిగత విభాగంలో భారత్కు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం.
అంతకుముందు మహిళల ట్రాప్ టీమ్ ఈవెంట్లో ఆషిమా అహ్లావత్, మనీషా కీర్లతో కలిసి నీరూ రజతం గెలిచారు.
వ్యక్తిగత విభాగంలో పసిడి సాధించి తన ఖాతాలో మరో పతకాన్ని చేర్చుకున్నారు.
ఇప్పటివరకు భారత్ సాధించిన నాలుగు స్వర్ణాలు టీమ్ ఈవెంట్లలోనే వచ్చాయి.
మహిళల క్రికెట్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్, పురుషుల కబడ్డీ, మహిళల కబడ్డీలో భారత్ బంగారు పతకాలు సాధించింది.
నీరూ దండా విజయంతో వ్యక్తిగత విభాగంలోనూ భారత్కు స్వర్ణ బోణీ పడింది.
ఈ విజయంతో భారత్ ఖాతాలో 5 స్వర్ణాలు, 21 రజతాలు, 21 కాంస్యాలు..
మొత్తం 47 పతకాలు చేరాయి.



