మరోసారి భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్న బొత్స
విజయనగరం, సెప్టెంబర్ 12 (క్విక్ టుడే న్యూస్):
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. విజయనగరంలో జరిగిన వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రసంగం వింటూ బొత్స కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో పార్టీ నేతలు ఆయనను ఓదార్చారు. బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శ్రీను పార్టీ మార్పు అంశం ప్రస్తావనకు రావడంతో బొత్స తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కొద్దిసేపు కన్నీళ్లు పెట్టుకున్న బొత్సను సమావేశంలో ఉన్న పార్టీ నేతలు, కార్యకర్తలు ఓదార్చారు. అనంతరం ఆయనను సముదాయించారు. ఇటీవల చీపురుపల్లిలో జరిగిన వైసీపీ సమావేశంలోనూ బొత్స సత్యనారాయణ భావోద్వేగానికి గురయ్యారు. పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతున్న సమయంలో ఆయన బోరున ఏడ్చారు. అప్పట్లోనూ పార్టీ నేతలు బొత్సను ఓదార్చార్చిన విషయం తెలిసిందే.


