Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Jul 31, 2026Short Read
చంద్రబాబుపై మండిపడ్డ వైఎస్ జగన్.. ఎందుకంటే?
క్విక్ టుడే న్యూస్, జులై 31 :- ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
"నువ్వు మనిషివా..
రాక్షసుడివా" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మనిషన్న వాడికి మనసుండాలని, ఏ సంఘటన జరిగినా దానిని వదలకుండా ట్విస్ట్లు చేసి ఎదుటివారిని నాశనం చేయాలనే దుర్మార్గపు ఆలోచనలు మానుకోవాలని ఆయన హితవు పలికారు.విషపు విత్తనాలు నాటితే భవిష్యత్తులో అవే చెట్లుగా మారుతాయని జగన్ హెచ్చరించారు.
తన మంత్రిని పంపి కులాల మధ్య చిచ్చు రేపడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.
గతంలో టీడీపీ నేతలు యాక్సిడెంట్లు చేసినప్పుడు వారిపై హత్య కేసులు పెట్టారా?
అని జగన్ ప్రశ్నించారు.
ఈ వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది.





