Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Jul 31, 2026Short Read
ప్రధాని పర్యటన.. 'నో ఫ్లయింగ్ జోన్'గా భోగాపురం
క్విక్ టుడే న్యూస్, జులై 31 :- ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో భోగాపురం ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాలను 48 గంటలపాటు నో ఫ్లయింగ్ జోన్‌గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఈ ఉత్తర్వులు రేపు రాత్రి 8 గంటల వరకు అమల్లో ఉంటాయి.
విమానాశ్రయం, సభా వేదిక, మరియు హెలిప్యాడ్ చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లు, పారా గ్లైడర్లు, మరియు మైక్రో లైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల విమానయానంపై నిషేధం విధించినట్లు అధికారులు తెలిపారు.
భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవం కోసం రేపు మోడీ రానున్నారు.
Subscribe to Our Newsletter
Get the latest news delivered to your inbox.


