
చెత్త కుప్పలతో కంపు కొడుతున్న తొర్రూర్ చెరువు కట్ట
పట్టించుకోని మున్సిపల్ అధికారులు
తొర్రూరు జూలై 14(క్విక్ టుడే న్యూస్):
పట్టణ కేంద్రంలోని పెద్ద చెరువు కట్ట ప్రాంతం చెత్తాచెదారంతో నిండిపోవడంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. నిత్యం వందలాది మంది రాకపోకలు సాగించే ఈ ప్రాంతంలో ఎక్కడపడితే అక్కడ చెత్త వేయడం వల్ల పారిశుద్ధ్య సమస్య తీవ్రమైంది.చెత్త పేరుకుపోవడంతో ఈగలు, దోమలు విపరీతంగా పెరిగి సమీపంలోని నివాస ప్రాంతాల్లోకి చేరుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వర్షాకాలంలో పరిస్థితి మరింత దిగజారి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని వారు పేర్కొంటున్నారు.పట్టణ ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించాల్సిన మున్సిపల్ చెర్మన్,అధికారులు ప్రజాప్రతినిధులు ఈ సమస్యపై దృష్టి సారించడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.చెరువు కట్ట ప్రాంతాన్ని వెంటనే శుభ్రం చేసి,చెత్త తొలగింపుతో పాటు క్రమం తప్పకుండా పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. అదేవిధంగా, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా అవగాహన కల్పించడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు మున్సిపల్ అధికారులను డిమాండ్ చేస్తున్నారు.
Subscribe to Our Newsletter
Get the latest news delivered to your inbox.

