
జాడలేని వర్షాలు... ముఖం చాటేసిన మబ్బులు
మళ్లీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
హైదరాబాద్, జూలై13(క్విక్ టుడే న్యూస్):
తెలంగాణలో జులై నెలలోనూ ఎండలు తీవ్రత మళ్లీ మెల్లగా పెరుగుతోంది. వర్షాలు ముఖం చాటేయంతో ఎండలు కొనసాగుతున్నాయి. సాధారణంగా ఈ కాలంలో వర్షాలు కురవాల్సి ఉండగా, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు మళ్లీ పెరిగాయి. జులై రెండో వారంలోనూ సాధారణం కంటే సుమారు 3.5 డిగ్రీల సెల్సియస్ అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణ పరిస్థితుల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పగటి వేళల్లో ఎండ తీవ్రత పెరిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, వచ్చే రెండు రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.





