
భోజ్‌శాలలో ముస్లింల ప్రార్థనలకు తాత్కాలిక ఊరట
రాంచి, జూలై14:
మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఉన్న వివాదాస్పద భోజ్‌శాల–కమల్ మౌలా మసీదు ప్రాంగణంలో శుక్రవారం నమాజ్ నిర్వహించేందుకు ముస్లింలకు సుప్రీంకోర్టు తాత్కాలిక ఉపశమనం కల్పించింది. వివాదాస్పద ప్రాంతానికి ఆనుకుని ఉన్న స్థలాన్ని ప్రార్థనల కోసం వినియోగించుకోవచ్చని కోర్టు ఆదేశించింది. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు ఆ ప్రదేశంలో నమాజ్ నిర్వహించుకోవాలని స్పష్టం చేసింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ, జస్టిస్ ఎన్.వి. మోహన్లతో కలిసి ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన వివాదానికి సంబంధించిన పిటిషన్లపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో, తాత్కాలిక ఏర్పాటుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోర్టు పేర్కొంది. అదేవిధంగా, తమ అనుమతి లేకుండా వివాదాస్పద భోజ్‌శాల ప్రాంగణంలో ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టరాదని పురావస్తు శాఖకు సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.





