
భారత్‌లో పెరుగుతున్న విదేశీ విద్యార్థుల సంఖ్య
ఇండియాలో అత్యధికంగా నేపాల్ విద్యార్థులు
న్యూఢిల్లీ, జూలై13:
ఇండియాలో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో నేపాల్ దేశానికి చెందిన వారే అత్యధికంగా ఉన్నారని కేంద్ర విద్యాశాఖ నిర్వహించిన సర్వేలో తేలింది. 2023`24 అకాడమిక్ ఇయర్లో ఎక్కువ మంది విదేశీ విద్యార్థులకు ఆతిథ్యం ఇచ్చిన రాష్ట్రంగా కర్ణాటక ప్రథమ స్థానంలో నిలిచిందని ఆ సర్వే పేర్కొంది. కేంద్ర విద్యాశాఖ తాజాగా విడుదల చేసిన జాబితా ప్రకారం 2023`24 అకాడమిక్ ఇయర్లో దేశంలోని వివిధ కళాశాలలు 173 దేశాలకు చెందిన విద్యార్థులకు చోటు కల్పించాయి. దేశ వ్యాప్తంగా ఉన్న యÖనివర్సిటీలు, కళాశాలల్లో 58,134 మంది విద్యార్థులు ఎన్రోల్ చేసుకున్నారు. భారతదేశానికి చదువుకోవడానికి వచ్చే విదేశీ విద్యార్థులలో నేపాల్‌కు చెందిన వారు 24.1 శాతం మంది ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో యÖఏఈ నుంచి 7 శాతం.. అమెరికా నుంచి 5.9 శాతం.. బంగ్లాదేశ్ నుంచి 5.9 శాతం మంది విద్యార్థులు ఉన్నారు.





