Back to FeedQuickToday Shorts

General
Sep 7, 2026Short Read
కార్ల ప్రియులకు బిగ్ షాక్: మారుతీ సుజుకీ ధరలు రూ.20,000 వరకు పెంపు!
ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ తమ కస్టమర్లకు షాక్ ఇచ్చింది.
ఎంపిక చేసిన కార్ల మోడళ్లపై ధరలను రూ.20,000 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది.
పెంచిన ధరలు ఈ నెల నుంచే అమలులోకి రానున్నాయి.
ముడిసరుకుల వ్యయం గణనీయంగా పెరగడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని సంస్థ పేర్కొంది.కాగా, ఈ ఏడాది మే నెల నుంచి మారుతీ సుజుకీ కార్ల ధరలను పెంచడం ఇది మూడోసారి కావడం గమనార్హం.
అయితే ఏయే మోడళ్లపై ఎంత వరకు ధరలు పెరుగుతాయనే స్పష్టతను కంపెనీ ఇంకా ఇవ్వలేదు.
ఇటీవల టాటా మోటార్స్, హ్యుందాయ్ కంపెనీలు కూడా ప్రైస్ హైక్ ప్రకటించిన సంగతి తెలిసిందే.





