
ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ: కవిత
హైదరాబాద్, సెప్టెంబర్26(క్విక్ టుడే న్యూస్):
తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడిన ఆమె.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మాటలు, ప్రచారానికే పరిమితమైందని ఆరోపించారు. ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ చేస్తుందని ప్రకటించారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించేందుకు తమ అభ్యర్థిని బరిలోకి దింపుతామని తెలిపారు. కేటీఆర్ ఫామ్‌హౌస్ వ్యవహారంతో ప్రజల దృష్టిని పాలనా వైఫల్యాల నుంచి మళ్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కవిత ఆరోపించారు. ఫామ్‌హౌస్‌ల విషయంలో ప్రభుత్వం ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోదని విమర్శించారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికను ప్రత్యక్ష రాజకీయ పోరాటానికి తొలి వేదికగా ఎంచుకున్నామని, విజయం కోసం కృషి చేస్తామని చెప్పారు. దానం నాగేందర్‌పై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడటంతో ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక అనివార్యమైంది.



