
బీఎల్ఏలు పార్టీకి వెన్నెముకలా పనిచేయాలి
తొర్రూరు మండల,పట్టణ బీఎల్ఏలకు ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి దిశానిర్దేశం
పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తొర్రూరు మండల,పట్టణ బిఎల్ఏ ఏజెంట్లతో ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.బూత్ స్థాయిలో పార్టీ బలోపేతం,ఓటరు జాబితా సవరణలు,క్షేత్రస్థాయిలో సమన్వయం వంటి అంశాలపై బీఎల్ఏలకు ఆమె దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ....ప్రతి బూత్‌లో పార్టీ కార్యక్రమాలను మరింత చురుకుగా నిర్వహిస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు.కొత్తగా ఓటు హక్కు పొందిన అర్హుల పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేయడంతో పాటు,తప్పులు,మార్పులు,చేర్పులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని,వారి సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.పార్టీ బలోపేతంలో బీఎల్ఏలపాత్ర కీలకమని,ప్రతి బూత్‌లో సమన్వయంతో పనిచేస్తూ పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ తూనం శ్రవణ్ కుమార్,మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రవీంద్ర చారి,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ముద్దసాని సురేష్,పార్టీ నాయకులు,మండల పట్టణ ఇంచార్జిలుబీఎల్ఏలు,ప్రజాప్రతినిధులు,
కార్యకర్తలు పాల్గొన్నారు.





