Back to FeedQuickToday Shorts

General
Jul 29, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
మహిళా కోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి జోగి రమేశ్ కుటుంబ సభ్యులు
విజయవాడ, జూలై 29 (క్విక్ టుడే న్యూస్):
మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నాయకుడు జోగి రమేశ్ కుటుంబ సభ్యులు తమను అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని కోరుతూ విజయవాడ మహిళా కోర్టును ఆశ్రయించారు. వరకట్న వేధింపులు, గృహహింస, హత్యాయత్నం ఆరోపణలకు సంబంధించిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని వారు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించిన మహిళా కోర్టు, కేసుకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. జోగి రమేశ్ పెద్ద కోడలు జోగి మేఘన ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం, గృహహింస, వరకట్న నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో జోగి రమేశ్‌తో పాటు ఆయన కుటుంబానికి చెందిన మొత్తం 11 మందిని నిందితులుగా చేర్చారు.



