Back to FeedQuickToday Shorts

General
Aug 18, 2026Short Read
జనగామ డంపింగ్ యార్డును పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్
జనగామ, ఆగస్టు 17 (క్విక్ టుడే న్యూస్):
జనగామ జిల్లాలోని డంపింగ్ యార్డును జనగామ మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి తో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా డంపింగ్ యార్డులో పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త సేకరణ, వ్యర్థాల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరచాలని అధికారులకు సూచించారు.
పట్టణ పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, చెత్తను శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.





