
పాత బీట్ బజార్లో గణేష్ ఉత్సవాలకు శ్రీకారం
భక్తిశ్రద్ధలతో పందిరి గుంజ ప్రతిష్ఠ
జనగామ, సెప్టెంబర్ 07 (క్విక్ టుడే న్యూస్):
జనగామ పట్టణ కేంద్రంలోని పాత బీట్ బజార్లో విగ్నేష్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాబోయే వినాయక చవితి పండుగ మహోత్సవాలను పురస్కరించుకుని గణేష్ మండప ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.
వేడుకల్లో భాగంగా సోమవారం స్థానిక భక్తులు, అసోసియేషన్ సభ్యుల సమక్షంలో అత్యంతవైభవంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో పందిరి గుంజ నాటడం జరిగింది.
ఈ.సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా పాత బీట్ బజార్లో వినాయక చవితి ఉత్సవాలను అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ ఏడాది కూడా గణపయ్యను ప్రతిష్టించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని పేర్కొన్నారు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజూ ప్రత్యేక పూజలు తీర్థప్రసాద వితరణ మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో విగ్నేష్ ఫ్రెండ్స్ అసోసియేషన్ నిర్వాహకులు, మహిళా సభ్యులు, పాతబీట్ బజార్ వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు





