
ట్రోల్స్, అనవసర విమర్శలను పట్టించుకోవద్దు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ శౌర్య భవన్లో అభిమానులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 600 మందికి పైగా అభిమానులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్, అనవసర విమర్శలు, వివాదాలను పట్టించుకోవద్దని అభిమానులకు సూచించారు.
వాటికి స్పందించకుండా సంయమనం పాటిస్తూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని, సమయాన్ని మంచి పనుల కోసం వినియోగించాలని కోరారు.
అభిమానుల ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన వారితో కలిసి ఫోటోలు దిగుతూ ఆత్మీయంగా గడిపారు.
ఇదిలా ఉండగా, సినిమాల పరంగా అల్లు అర్జున్ ప్రస్తుతం దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న ‘రాకా’ చిత్రంలో నటిస్తున్నారు.
ఈ భారీ బడ్జెట్ చిత్రంలో దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తుండగా, కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.





