Back to FeedQuickToday Shorts
General
Aug 18, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
మద్యం మత్తులో యువకుల హల్చల్
నలుగురికి జరిమానా, 'స్వచ్ఛ భారత్' శిక్ష!
మేడిపల్లి, ఆగస్టు 18 (క్విక్ టుడే న్యూస్) :
మద్యం మత్తులో హల్చల్ చేసిన నలుగురు యువకులపై కేసు నమోదు చేసిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చెంగిచెర్లకు చెందిన వై మహేందర్ (31), ఉదయ్ కిరణ్ (25), డి పాషా(32), వరప్రసాద్ (47), యాకయ్య (35) మద్యం సేవించి మేడిపల్లి ఏరియాలో హల్చల్ చేశారు. దీంతో పోలీసులు పెట్టి కేసులు నమోదు చేసి చార్జిషీట్ దాఖలు చేశారు. వారిని ఎల్బీనగర్లోని ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా.. ఒక్కొక్కరికి జరిమానాతో పాటు 'స్వచ్ఛ భారత్' చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో నిందితులు పోలీస్ స్టేషన్, కోర్టు పరిసరాల్లో 'స్వచ్ఛ భారత్' చేశారు.



