
పెద్ది సుదర్శన్‌రెడ్డి కన్నుమూత.. బీఆర్ఎస్లో విషాదం
హైదరాబాద్, జూలై31(క్విక్ టుడే న్యూస్):
బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అనారోగ్యంతో చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి కన్నుమూశారు. సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన రాత్రి 12.50 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ నెల 26న హనుమకొండలో ఉన్న సమయంలో ఆయనకు తీవ్ర ఛాతినొప్పి రావడంతో తొలుత స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ కార్డియాక్ అరెస్ట్‌గా నిర్ధారించి అత్యవసర చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం యశోద ఆస్పత్రికి తరలించి వెంటిలేటర్‌పై ఉంచి ప్రత్యేక వైద్య బృందం చికిత్స కొనసాగించింది. అయితే ఎక్కువసేపు మెదడుకు తగినంత ఆక్సిజన్ అందకపోవడంతో నాడీ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నట్లు వైద్యులు తెలిపారు. పలు వైద్య పరీక్షల్లో మెదడు పనితీరు దెబ్బతిన్న సంకేతాలు కనిపించాయని పేర్కొన్నారు. సుదర్శన్‌రెడ్డి మరణవార్తతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులు అర్పిస్తున్నారు.





