
ఖైరతాబాద్ ఎమ్మెల్యే స్థానం ఖాళీ.. దానం నాగేందర్ అనర్హతతో గెజిట్ నోటిఫికేషన్ జారీ
దానం నాగేందర్ అనర్హత నేపథ్యంలో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు అసెంబ్లీ కార్యదర్శి రండ్ల తిరుపతి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు.
హైకోర్టు తీర్పు మేరకు 2024 ఏప్రిల్ 23 నుంచి స్థానం ఖాళీగా ఉన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్థించడంతో ఉప ఎన్నికకు మార్గం సుగమమైంది.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలిచిన దానం నాగేందర్..
2024లో కాంగ్రెస్లో చేరి సికింద్రాబాద్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు.
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఆయన అనర్హతపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు విచారించి ఎమ్మెల్యే పదవిని రద్దు చేసింది.
ఈ తీర్పును సుప్రీంకోర్టు సెప్టెంబర్ 24న సమర్థించింది.
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో, ఉప ఎన్నిక షెడ్యూల్ తుది ఓటర్ల జాబితా ప్రక్రియ పూర్తయ్యాక వెలువడే అవకాశం ఉంది.



