
రకుల్ ప్రీత్ సింగ్ సంబంధిత ప్రాంతాల్లో ఐటీ సోదాలు
బాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్‌కు సంబంధించిన ప్రదేశాలతో పాటు ఆమె మామ, నిర్మాత వాసు భగ్నానీ, పనోరమా స్టూడియోస్‌కు చెందిన కార్యాలయాలు, ఇతర ప్రాంతాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోమవారం సోదాలు నిర్వహించినట్లు సమాచారం.
ముంబయిలోని పలు ప్రాంతాల్లో ఐటీ శాఖకు చెందిన బృందాలు తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది.
సుమారు 12 ప్రాంతాల్లో సోదాలు జరిగినట్లు సమాచారం కాగా, 15 ప్రాంతాల్లో తనిఖీలు జరిగినట్లు కూడా కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి.
సినిమా ప్రాజెక్టుల ఫైనాన్సింగ్, నిర్మాణం, విదేశీ పంపిణీకి సంబంధించిన ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు జరిగాయన్న అనుమానాలతో ఈ తనిఖీలు జరుగుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
బ్యాంకు లావాదేవీలు, విదేశీ చెల్లింపులు, కంపెనీలకు సంబంధించిన పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
అయితే ఇప్పటివరకు ఈ సోదాల్లో పన్ను ఎగవేత లేదా ఇతర ఆర్థిక నేరాలు నిర్ధారణ కాలేదు.
దర్యాప్తు పూర్తయిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.





