
భద్రకాళి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు ప్రారంభం
వరంగల్, జూలై29(క్విక్ టుడే న్యూస్):
వరంగల్ నగరంలోని ప్రసిద్ధ శ్రీ భద్రకాళి దేవస్థానంలో శాకంబరి ఉత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి శాకంబరి దేవి రూపంలో దర్శనమిచ్చారు. ఈ అపూర్వ అలంకరణను తిలకించేందుకు తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని క్యూలైన్లలో నిలబడి దర్శనం చేసుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు, నైవేద్యాలు నిర్వహించిన అర్చకులు రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు, సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడగా, ఉత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ కొనసాగింది. భద్రతా ఏర్పాట్లతో పాటు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.





