Back to FeedQuickToday Shorts

General
Jul 30, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
మణుగూరు లో డాగ్ స్క్వాడ్ తనిఖీలు...
మాదక ద్రవ్యాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన పోలీసులు...
భద్రాద్రి జిల్లా ప్రతినిధి,( క్విక్ టు డే న్యూస్).
మణుగూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పాఠశాలలు, కళాశాలల పరిసరాలు మరియు పాన్ షాపుల్లో కొత్తగూడెం హెడ్‌క్వార్టర్స్ నుండి వచ్చిన డాగ్ స్క్వాడ్ బృందం ఆధ్వర్యంలో బుదవారం సాయంత్రం విస్తృతంగా తనిఖీలు నిర్వహించినట్లు మణుగూరు టౌన్ ఎస్సై రావూఫ్ ఒక ప్రకటనలో తెలిపారు.ప్రభుత్వం నిషేధించిన గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాలు ఉన్నాయా అనే ఉద్దేశంతో విస్తృతంగా తనిఖీలు చేపట్టారని అన్నారు.
ఈ తనిఖీల్లో ఎటువంటి నిషేధిత మాదక పదా ర్థాలు లభించ లేదు.
విద్యార్థులు, షాపు యజమాను లకు మాదకద్రవ్యాల వినియోగం, విక్రయం చట్టరీత్యా నేరమని, అవగాహన కల్పించి,అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే పోలీసు లకు తెలియజేయాలని సూచించా రు.ఈ కార్యక్రమం లో డాగ్ స్కాడ్ సిబ్బంది, మణుగూరు పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు.



