
బ్యాక్లాగ్ ఉన్న వారి కోసం కాకతీయ వర్సిటీ మరో అవకాశం
హనుమకొండ, జూలై30(క్విక్ టుడే న్యూస్):
కాకతీయ యూనివర్సిటీ పరిధిలో నిర్ణీత కాలవ్యవధిలో తమ డిగ్రీ లేదా పీజీ కోర్సులను పూర్తి చేయలేక బ్యాక్‌లాగ్‌లు మిగిలిపోయిన పూర్వ విద్యార్థులకు 2026–27 విద్యాసంవత్సరానికి తుది అవకాశాన్ని కల్పిస్తున్నట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం వెల్లడించారు. అర్హులైన విద్యార్థులు థియరీ, ప్రాక్టికల్, ప్రాజెక్ట్ వర్క్, సెమినార్ తదితర పరీక్షలకు దరఖాస్తు చేసుకుని పెండింగ్‌లో ఉన్న సబ్జెక్టులను పూర్తి చేసుకోవచ్చన్నారు. ఇందుకోసం యూనివర్సిటీ రిజిస్ట్రార్ నుంచి ప్రత్యేక అనుమతి పొందడంతో పాటు నిర్దేశించిన పరీక్షా రుసుములను చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. యూజీ, పీజీ విద్యార్థులు ప్రస్తుతం చదువుతున్న బ్యాచ్‌లతో కలిసి పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. అవసరమైతే పీజీ విద్యార్థులు ఎస్డీఎల్సీఈ నిర్వహించే పరీక్షలతో పాటు ప్రత్యేక అనుమతి పొంది పరీక్షలు రాయవచ్చన్నారు. అర్హులైన పూర్వ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.





