Back to FeedQuickToday Shorts

General
Jul 31, 2026Short Read
గూడూరు గురుపీఠం ఆలయంలో చోరీ కలకలం తాళాలు పగులగొట్టి దుండగుల చేతివాటం
సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు
శివ్వంపేట, జులై 31(క్విక్ టు డే న్యూస్):
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గూడూరు గ్రామంలోని శ్రీ గురుపీఠం ప్రాంగణంలో ఉన్న శ్రీ దత్తాత్రేయ స్వామి, శ్రీ సాయిబాబా ఆలయంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయ తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు విలువైన వస్తువులు, నగదును అపహరించినట్లు అనుమానిస్తున్నారు. శుక్రవారం ఉదయం ఆలయ నిర్వాహకులు ఘటనను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిశీలించి సీసీటీవీ ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను త్వరలోనే గుర్తించి అరెస్టు చేస్తామని తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో కలకలం రేగగా, భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.





