Back to FeedQuickToday Shorts

General
Jul 29, 2026Short Read
ఎమ్మెల్యే పాయం ను కలిసిన జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి ఎస్కే ఖదీర్...
పినపాక ఆర్ సీ జులై 28,( క్విక్ టు డే న్యూస్).
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ఎస్కే ఖదీర్ జన్మదిన వేడుకల సందర్భంగా పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి పుష్పగుచ్ఛం అందించి ఆశీస్సులు పొందారు.
అనంతరం ఎమ్మెల్యే ఎస్కే ఖదీర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియ జేస్తూ, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో, ప్రజాసేవలో మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.





