Back to FeedQuickToday Shorts

Telangana
Sep 4, 2026Short Read
తెలంగాణలో పోస్టర్ వార్: KCR, రేవంత్‌లపై BRS, కాంగ్రెస్ రచ్చ
తెలంగాణలో కాంగ్రెస్ 1000 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా BRS, కాంగ్రెస్ పార్టీల మధ్య నిరసనల హోరు తీవ్రమైంది.
హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు BRS చీఫ్ KCRను 'కుంభకర్ణుడిలా' చిత్రీకరిస్తూ, ఆయన వేయ్యి రోజుల నుంచి మొద్దునిద్రపోతున్నారంటూ నిరసన తెలిపారు.మరోవైపు పీర్జాదిగూడలో సీఎం రేవంత్‌రెడ్డిని విలన్‌గా పోలుస్తూ BRS శ్రేణులు భారీ కటౌట్ ఏర్పాటు చేశాయి.
'కాంగ్రెస్ 420 మోసాలు' అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాయి.
ఇరు పార్టీలు ఒకరిపైఒకరు వినూత్న రీతిలో ఫ్లెక్సీలు, కటౌట్లతో విరుచుకుపడటంతో రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.





