Back to FeedQuickToday Shorts

International
Sep 24, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
యూఎస్-చైనా శత్రువులుగా ఉండొద్దు.. భాగస్వాములుగా సాగాలి: జిన్పింగ్ పిలుపు!
అమెరికా పర్యటన వేళ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు.
చైనా, అమెరికాలు శత్రువులుగా ఉండకూడదని, భాగస్వాములుగా కలిసి ముందుకు సాగాలని ఆయన స్పష్టం చేశారు.
ఈ రెండు దేశాలు, అలాగే ఇక్కడి ప్రజలు ఎంతో గొప్పవారని ఆయన పేర్కొన్నట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది.ఇక మే నెలలో ట్రంప్ చైనాలో పర్యటించిన సమయంలో, ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక స్థిరత్వ బంధాన్ని నిర్మించుకోవడానికి తామిద్దరం అంగీకరించినట్లు జిన్పింగ్ గుర్తుచేశారు.
రాబోయే రోజుల్లో చైనా, అమెరికాలు ఒకే దిశలో కలిసి పనిచేయాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు.



