Back to FeedQuickToday Shorts

Telangana
Sep 24, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
ఒక వికెట్ పడింది.. త్వరలోనే మరిన్ని పడతాయి: కేటీఆర్ సంచలన ట్వీట్!
దానం నాగేందర్ అనర్హత వేటు నుంచి తప్పించుకోవాలని చూసినా, సుప్రీంకోర్టు పిటిషన్ను తిరస్కరించి చెంపదెబ్బ కొట్టిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ట్వీట్ చేశారు.
"ఎమ్మెల్యేల చోర్ రాహుల్ గాంధీ ఇది గుర్తుంచుకో..
ఇప్పటికే ఒక వికెట్ పడింది, త్వరలోనే మరిన్ని వికెట్లు పడతాయి" అంటూ ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు పార్టీ ఫిరాయింపుల ద్వారా ప్రజా తీర్పును దొంగిలించి, స్పీకర్ వెనుక దాక్కోవచ్చని భావించారని ఆరోపించారు.
ఈ కాంగ్రెస్ దుష్పరిపాలనపై ఖైరతాబాద్ ప్రజలు త్వరలోనే ఉప ఎన్నికల ద్వారా సరైన తీర్పు ఇస్తారని కేటీఆర్ పేర్కొన్నారు.



