
నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో బాలింత మమత ఆత్మహత్య
నల్గొండ, ఆగస్టు12 క్విక్ టుడే న్యూస్):
నల్గొండ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో బాలింత బుధవారం తెల్లవారుజామున ఆత్మహత్య పాల్పడింది. మునుగోడు మండలం చీకటిమామిడికి చెందిన మమత (27) 8 రోజుల క్రితం ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో మమత చేరినది. ముగ్గురు ఆడపిల్లల తర్వాత ఆమె నాలుగవ సంతానం ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరింది. నాల్గవ సంతానం కూడా ఆడపిల్లకు జన్మనిచ్చింది. వరుసగా ఆడపిల్లలే పుట్టడంతో అత్తింటి వారి నుండి వేధింపులు ఎక్కువ కావడంతో ఆత్మహత్యకు పాల్పడిందని బంధువులు ఆరోపిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున వార్డు నుంచి బయటకు వచ్చిన మమత పోస్టుమార్టం గది సమీపంలో చీరతో ఉరేసుకుని మృతి చెందింది. లింగ వివక్షత వరుణ ఇంకా ఎంతమంది ప్రాణాలు తీసుకుంటారో అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మమత ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.





