Back to FeedQuickToday Shorts

Telangana
Sep 21, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
ట్యాంక్‌బండ్ వద్ద ఘర్షణ వాతావరణం.. నిమజ్జన ఆంక్షలపై గణేష్ ఉత్సవ సమితి నిరసన
హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద వినాయక నిమజ్జనాలపై విధించిన ఆంక్షలు తీవ్ర కలకలం రేపాయి.
హైకోర్టు ఉత్తర్వుల మేరకు హుస్సేన్‌సాగర్ ప్రాంగణంలో నిమజ్జనాలను నిరోధించేందుకు పోలీసులు ఇనుప బారికేడ్లను అమర్చారు.
అయితే పూర్వపద్ధతిలోనే నిమజ్జనాలకు అనుమతించాలని డిమాండ్ చేస్తూ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి, బజరంగ్ దళ్ ప్రతినిధులు నిరసనకు దిగారు.
ఆగ్రహానికి గురైన ఆందోళనకారులు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించి, కొన్నింటిని హుస్సేన్‌సాగర్‌లోకి విసిరేశారు.
దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొనగా, పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.
Tags:#Telangana#National#Shorts




