Back to FeedQuickToday Shorts
Telangana
Sep 21, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
డీజేల మోత వద్దు.. ఇరుముడి స్టైల్ లో సీఐ వినూత్న అవగాహన
వినాయక నిమజ్జనాల్లో డీజేల భారీ శబ్దాల వల్ల ప్రాణనష్టం జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని రాంగోపాల్‌పేట సీఐ సురేష్ కుమార్ వినూత్నంగా స్పందించారు.
ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆయన స్వయంగా ఒక పాట పాడారు.
'ఇరుముడి' సినిమాలోని పాటకు ప్యారడీగా 'యాలాలో యాలాలో డీజేలు మనకొద్దురో' అంటూ పాడి దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
ప్రజలను ఆలోచింపజేసేలా ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సీఐ చేసిన ఈ ప్రయత్నంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


