Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Sep 12, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
ఏపీలో పొగాకు రైతులకు గుడ్ న్యూస్.. క్వింటాకు అదనంగా రూ.1,000!
సరైన ధరలు లేక నష్టపోతున్న పొగాకు రైతులకు ఏపీ ప్రభుత్వం ఊరటనిచ్చింది.
ఆఫ్-స్కేల్, లో-గ్రేడ్ రకాల పొగాకుకు క్వింటాకు రూ.1,000 (కిలోకు రూ.10) అదనంగా చెల్లించనున్నట్లు ప్రకటించింది.
వ్యాపారులు పొగాకు కొనుగోలు చేసిన 9 రోజుల్లోనే ఈ అదనపు మొత్తాన్ని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
అలాగే, వివిధ రకాలకు కనీస ధరలను కూడా ప్రభుత్వం ఖరారు చేసింది.
ఫైన్ గ్రేడ్‌కు కిలో రూ.230, మీడియం గ్రేడ్‌కు రూ.190, ఆఫ్-స్కేల్‌కు రూ.130, లో-గ్రేడ్‌కు రూ.110 గా నిర్ణయించారు.
Tags:#Andhra Pradesh#National#Shorts





