Back to FeedQuickToday Shorts

Telangana
Oct 1, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
సాయంత్రం 6 గంటలైనా ముగియని అంగన్వాడీ ఇంటర్వ్యూలు
కనీస వసతులు లేక అభ్యర్థుల అవస్థలు.. చిన్నపిల్లలతో వచ్చిన మహిళలకు మరింత ఇబ్బందులు
అంగన్వాడీ టీచర్లు, ఆయా పోస్టుల భర్తీ కోసం నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలు సాయంత్రం 6 గంటలు దాటినా కొనసాగుతుండటంతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఉదయం నుంచే ఇంటర్వ్యూల కోసం వచ్చిన అభ్యర్థులు గంటల తరబడి తమ వంతు కోసం పడిగాపులు కాయాల్సి వచ్చింది.ఇంటర్వ్యూ కేంద్రంలో సరైన కూర్చునే వసతులు, తాగునీరు తదితర కనీస సౌకర్యాలు లేకపోవడంతో అభ్యర్థులు అవస్థలు పడ్డారు.
ముఖ్యంగా చిన్నపిల్లలతో వచ్చిన మహిళా అభ్యర్థులు తమ పిల్లలను చూసుకుంటూ గంటల తరబడి వేచి ఉండాల్సి రావడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఇంటర్వ్యూలు ఎప్పుడు పూర్తవుతాయో తెలియక అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.
సంబంధిత అధికారులు స్పందించి అభ్యర్థులకు కనీస వసతులు కల్పించడంతో పాటు ఇంటర్వ్యూల నిర్వహణలో తగిన ఏర్పాట్లు చేయాలని వారు కోరుతున్నారు.



