Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Aug 2, 2026Short Read
తక్కువ ధరకే బియ్యం పంపిణీ పథకం ప్రారంభం
క్విక్ టుడే న్యూస్, ఏపీ :- ప్రజలకు తక్కువ ధరకే బియ్యం అందించే పథకాన్ని ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడలో ప్రారంభించారు.
దీని కింద, రూ.62 విలువైన BPT సూపర్ ఫైన్ బియ్యం రూ.52కే, రూ.58 విలువైన గ్రేడ్-1 బియ్యం రూ.50కే అందిస్తారు.
రాష్ట్రవ్యాప్తంగా 130 రైతు బజార్లు, 500 రైస్ మిల్లుల కౌంటర్లలో ఈ విక్రయాలు జరుగుతాయి.
ఆధార్ కార్డు ద్వారా ఒక కుటుంబానికి నెలకు 10 కిలోల బియ్యం పంపిణీ చేయనున్నారు.




