
దొంగతనం కేసును ఛేదించిన మేడిపల్లి పోలీసులు
మేడిపల్లి, నవంబర్ 12 (క్విక్ టుడే న్యూస్):
బోడుప్పల్ ఎస్బీఆర్ కాలనీలో జరిగిన ఇంటి దొంగతనం కేసును మేడిపల్లి పోలీసులు ఛేదించారు. చోరీకి పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసి, అతడి నుంచి బంగారం, వెండి, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 8న ఎస్బీఆర్ కాలనీలో నివాసముంటున్న రవీంద్రచారి ఇంట్లో దొంగతనం జరిగింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక, ఇతర ఆధారాలను విశ్లేషించి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల గ్రామానికి చెందిన మాలోతు ప్రశాంత్ (25)ను నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు. అతడి నుంచి 4.4 తులాల బంగారం, 25 తులాల వెండి, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. కేసును త్వరితగతిన ఛేదించిన డీఎస్ఐ బోలిశెట్టి శ్రీను, హెచ్‌సీ రాము, పీసీలు మహిపాల్, హరిబాబులను మేడిపల్లి ఇన్స్పెక్టర్ జలంధర్‌రెడ్డి అభినందించారు.



