
గవర్నమెంట్ ఉద్యోగాల నియామకాలపై వైఎస్ జగన్ ఫైర్
ఆంధ్రప్రదేశ్ DSC నియామకాలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు.
స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన పాత ప్రభుత్వ ఉత్తర్వులను (GO) ప్రభుత్వం మార్చిందని ఆయన విమర్శించారు.
పరీక్షలు రాయకుండానే ప్రభుత్వ ఉద్యోగాలకు నేరుగా రిక్రూట్ చేసేలా GO నెం.4, GO నెం.47 లను జారీ చేశారని జగన్ ఆరోపించారు.
ఈ విధానం ద్వారా సుమారు 372 మందికి ఉద్యోగాలు కల్పించారని, ఆ తర్వాత వెంటనే ఈ జీవోలను ఉపసంహరించుకుంటూ (withdraw) కొత్త ఉత్తర్వులు జారీ చేశారని ఆయన మండిపడ్డారు.ఈ చర్యలు పూర్తిగా అక్రమాలకు తావిస్తున్నాయని, ఇది కచ్చితంగా 'డీఎస్సీ స్కామ్' అని జగన్ అభివర్ణించారు.
"పని పూర్తవగానే ఈ జీవోలను ఎందుకు వెనక్కి తీసుకున్నారు?
దీనికి సీఎం చంద్రబాబు నాయుడు నైతిక బాధ్యత వహిస్తారా?" అని జగన్ సూటిగా ప్రశ్నించారు.
ఈ అంశంపై ప్రభుత్వ తీరును ఎండగడుతూ, నిరుద్యోగులకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.



