Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Aug 31, 2026Short Read
నదుల అనుసంధానంతో నీటి వివాదాలకు శాశ్వత చెక్: సీఎం చంద్రబాబు
గోదావరి, కావేరి, కృష్ణా, పెన్నా, తుంగభద్ర నదుల అనుసంధానంతో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య నీటి వివాదాలకు ముగింపు లభిస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై కీలక ప్రతిపాదన చేశారని ఆయన గుర్తుచేశారు.
వృథాగా పోతున్న గోదావరి జలాలను నల్లమల సాగర్‌కు తరలించాల్సిన అవసరం ఉందని, ఇందుకు అమిత్ షా కూడా సానుకూలంగా ఉన్నారని చంద్రబాబు వెల్లడించారు. ఈ అనుసంధాన ప్రాజెక్టులు పూర్తయితే భవిష్యత్తులో ఈ నాలుగు రాష్ట్రాల మధ్య ఎలాంటి నీటి యుద్ధాలు ఉండవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.





