Back to FeedQuickToday Shorts

National
Sep 21, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్: వరుసగా 5 రోజులు బ్యాంకులు బంద్!
ఈ నెలలో బ్యాంక్ ఖాతాదారులకు వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండవు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) సమ్మెకు పిలుపునిచ్చింది. దీనికి ముందు 26న నాలుగో శనివారం, 27న ఆదివారం కావడంతో మొత్తం 5 రోజుల పాటు బ్యాంక్ శాఖలు మూతపడనున్నాయి.
బ్యాంకుల్లో నేరుగా పనులు ఉన్న వినియోగదారులు శనివారంలోగానే పూర్తి చేసుకోవాలని ఎస్బీఐ సహా ఇతర బ్యాంకులు సూచించాయి. అయితే ఖాతాదారులకు ఇబ్బంది కలగకుండా ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యోనో, యూపీఐ, ఏటీఎం వంటి డిజిటల్ ఛానల్స్ సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశాయి.
Tags:#National#National#Shorts



