Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Sep 21, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
ఏపీ స్థానిక ఎన్నికలు: జనసేన సీట్ల లెక్కలపై ఉత్కంఠ
ఏపీలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏ కూటమిలో సీట్ల కేటాయింపు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల మధ్య సీట్ల పంపిణీ ఏ విధంగా ఉంటుందనే దానిపై పార్టీల క్యాడర్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ ఎన్నికల్లో 35-40% సీట్లను ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతుండగా, ఆ సంఖ్య చివరికి 20-25% శాతానికే పరిమితం కావచ్చనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
ఈ నెల 22వ తేదీన కాకినాడలో జరగబోయే ఎన్నికల సన్నాహక సమావేశంలో పవన్ కల్యాణ్ ఈ సీట్ల సర్దుబాటు అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉందని సమాచారం.



