Back to FeedQuickToday Shorts
General
Sep 21, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
ప్యారడైజ్’ సందడి: 10 వేలమంది అభిమానులకు నాని బిగ్ సర్ప్రైజ్!
‘ప్యారడైజ్’ సినిమా విడుదల వేళ నేచురల్ స్టార్ నాని తన అభిమానులకు గ్రాండ్ ట్రీట్ ఇవ్వనున్నారు.
హైదరాబాద్‌లోని సారథి స్టూడియో వేదికగా దాదాపు 10 వేల మంది ఫ్యాన్స్‌ను ఆయన నేరుగా కలవనున్నారు.
దీంతో దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుంటుండటంతో ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తనను కలిసేందుకు వస్తున్న ఫ్యాన్స్ కోసం నాని ప్రత్యేకంగా వెజ్, నాన్-వెజ్ రుచికరమైన విందు భోజనాలను సిద్ధం చేయించారు.
మరోవైపు ‘ప్యారడైజ్’ అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతుండగా, ఒక్క నైజాం ప్రాంతంలోనే ఇప్పటికే లక్షకు పైగా టికెట్లు అమ్ముడవడం విశేషం.
Tags:#General#National#Shorts




