Back to FeedQuickToday Shorts
Andhra Pradesh
Sep 21, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
విజయవాడలో ఉద్రిక్తత: సాప్ ఆఫీస్ వద్ద వైకాపా, టీచర్ల ఆందోళన
విజయవాడ బందరు రోడ్డులోని ప్రాంతంలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
మెగా DSC స్పోర్ట్స్ కోటా ఎంపికల్లో తీవ్ర అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వైకాపా నాయకులు సాప్ (SAAP) కార్యాలయ ముట్టడికి యత్నించారు.
ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర తోపులాట జరిగింది.
అనంతరం వైకాపా నేతలు కార్యాలయం ముందే బైఠాయించి నిరసన తెలిపారు.మరోవైపు, అదే స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు కూడా వారికి పోటీగా ఆందోళనకు దిగడంతో అక్కడ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
దీంతో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అక్కడ భారీగా మోహరించారు.
Tags:#Andhra Pradesh#National#Shorts




