Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Sep 19, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
వచ్చే ఎన్నికల బరి చీపురుపల్లి నుంచే.. మేనల్లుడిపై బొత్స సంచలన వ్యాఖ్యలు!
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తాను మళ్లీ చీపురుపల్లి నియోజకవర్గం నుంచే బరిలో దిగుతానని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో జగన్ మళ్లీ సీఎం అవుతారని, తాను మంత్రిని అవుతానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొందరు డబ్బులు సంపాదించుకుని వెళ్లిపోయారంటూ తన మేనల్లుడు మజ్జి శ్రీనును ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. 1996లో ఎంపీగా పోటీ చేసిన సమయంలో తాను ప్రజలతో ఏ విధంగా మమేకమై ఉన్నానో.. ఇకపై కూడా అలాగే ఉంటానని ఆయన పేర్కొన్నారు. కాగా, 2024 సార్వత్రిక ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి పోటీ చేసిన బొత్స.. కళా వెంకట్రావు చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.



